ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజంలో ప్రశ్నించే గొంతుకలు కావాలి

ABN, First Publish Date - 2021-11-29T04:27:53+05:30

సమాజంలో జరుగుతున్న అణచివేతలపై ప్రశ్నించే గొంతుకలు కావాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం అన్నారు.

లక్షెట్టిపేటలో పుస్కకాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ రచయితల వేదిక సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం
లక్షెట్టిపేటరూరల్‌, నవంబరు 28: సమాజంలో జరుగుతున్న అణచివేతలపై ప్రశ్నించే గొంతుకలు కావాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం సాహితి స్రవంతి లక్షెట్టిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన కరిపె రాజ్‌కుమార్‌ రచించిన స్వేచ్ఛాగానం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కవులు, రచయితలు సామాజికంగా జరుగుతున్న వివక్షతలపై అసమానతల అణిచివేతపై తమ రచనల్లో బాణాలు ఎక్కు పెట్టాలని సూచించారు. ఉద్యమాలతోనే సాహిత్యం ఉంటుందని చెప్పారు. సాహిత్యంతోనే ఉద్యమాలు బలపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గోపగాని రవీందర్‌, నీలాదేవి, రాజేశ్వర్‌రావు, వేదిక ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, కవులు, రచయితలు కందుల తిరుపతి, గఫార్‌, రవీంద్ర, జనార్ధన్‌, సుబ్బాయమ్మ, భారతి, రమణ, వినయ్‌కుమార్‌, నాగవర్మ, అల్లాడి శ్రీనివాస్‌, రాజసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising