ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలి

ABN, First Publish Date - 2021-05-07T04:34:58+05:30

జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సాగునీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, మే 6: జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సాగునీటి పారుదల శాఖాధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఇరిగేషన్‌ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరం దించేలా ప్రణాళిక రూపొందిం చాలని సూచించారు. సాగునీటికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆసిఫా బాద్‌ నియోజక వర్గంలో కుమరం భీం, వట్టి వాగు ప్రాజెక్టులతో పాటు ఇతర మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల ద్వారా సాగునీరందేలా చూడాలన్నారు. 

ప్రాజెక్టులకు ఏవైనా మరమ్మతులు అవసరం అయితే ఖరీఫ్‌ సీజన్‌కంటే ముందుగానే చేసుకో వాలని సూచించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లా డుతూ నియోజక వర్గంలోని అనేక మంది ఆదివాసీ గిరిజనులు ఉన్నారని వారికి సాగునీరందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. అధికారులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ గుణవంత రావు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T04:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising