ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సప్త మాతృకల ఆరాధనే సీత్లా పండుగ

ABN, First Publish Date - 2021-07-28T05:50:53+05:30

రోగాల బారినపడి చనిపోతున్న పశు సంపదను కాపాడాలని కోరుతూ గిరిజనులు సప్త మాతృకలు అయిన (ఏడుగురు దేవతలు) మేరామ, తల్జా, కంకాళీ, మంత్రాల్‌, హింగ్లా, ద్వాళా గర్‌, సీత్లా భవానీలను పూజించుటయే సీత్లా పండుగ.

సీత్లా భవానికి పూజలు చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశు సంపద క్షేమం కోరుతూ దేవతలకు ప్రత్యేక పూజలు
నేరడిగొండ, జూలై 27: రోగాల బారినపడి చనిపోతున్న పశు సంపదను కాపాడాలని కోరుతూ గిరిజనులు సప్త మాతృకలు అయిన (ఏడుగురు దేవతలు) మేరామ, తల్జా, కంకాళీ, మంత్రాల్‌, హింగ్లా, ద్వాళా గర్‌, సీత్లా భవానీలను పూజించుటయే సీత్లా పండుగ. మండలంలోని వాగ్దారి, బోంది డి గ్రామాలలో ఈ వేడుకలను మంగళవారం గిరిజనులు ఘనంగా జరుపు కున్నారు. కాగా, వాగ్దారిలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీటీసీ జాదవ్‌ అనిల్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, నేరడిగొండ గ్రామాభివృద్ది కమీటీ అధ్యక్షు డు ఏలేటి రవీందర్‌రెడ్డి ముఖ్యఅతిఽథులుగా హాజరై సీత్లా భవానీకి ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతు గిరిజనుల కట్టు, బొట్టు, వేశధారణ, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు అతి పవిత్రంగా ఉంటా యని, అలాగే ప్రకృతిని పూజించడం, ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత అన్నారు. పశు సంపద క్షేమం కోసం గిరిజనులు సప్త మాతృకలను ఆరాధి స్తు ఈ పండుగను గిరిజన జాతి శోభ ఉట్టిపడేలా జరుపుకోవడం ఆనం దాయకమన్నారు. పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు జరుపు కోవాలని  సాహితీవేత్తలు, విద్యావంతులు కోరుతున్నారన్నారు. కాగా గిరిజన పండుగ ల్లో మొదటి పండుగ ఇదే కావడం విశేషమన్నారు. ఇందులో నాయక్‌, కారోబారి, డావ్‌, గేర్యాలతో పాటు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising