ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో సంక్రాంతి సంబరాలు

ABN, First Publish Date - 2021-01-16T04:23:37+05:30

జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వీధులన్నీ రంగవల్లులతో ఆకట్టుకున్నాయి.

విజేతలకు బహుమతి అందజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ముగ్గులతో మహిళల సందడి 

జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వీధులన్నీ రంగవల్లులతో ఆకట్టుకున్నాయి. మహిళలు ఉదయమే రంగులతో ముగ్గులను తీర్చిదిద్ది గొబ్బెమ్మలతో అలంకరించారు. 

ఆసిఫాబాద్‌రూరల్‌/ఆసిఫాబాద్‌/ చింతలమానేపల్లి/సిర్పూర్‌(యూ)/బెజ్జూరు/దహెగాం/పెంచికలపేట, జనవరి15: ఆసిఫాబాద్‌ జిల్లా కేందంతో పాటు మండలంలో మకర సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.  మరక సంక్రాంతిని పురస్కరించుకొని అయ్యప్ప ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు తమ ఇళ్లలో ప్రత్యేక నోములు నోచుకుంటు వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే యువకులు, చిన్నారులు పతంగులు ఎగురవేసి ఆనందంగా గడిపారు. పట్టణంలోని సందీప్‌నగర్‌, సిద్దివినాయకనగర్‌లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సందీప్‌నగర్‌లో గురువారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మీనా, సాయిప్రసన్న, శృతిలకు  శుక్రవారం జడ్పీ ఛైర్‌ప ర్సన్‌ కోవలక్ష్మి బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌, సింగిల్‌ విండో చై ర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, వాంకిడి జడ్పీటీసీ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు చిలూవేరి వెంకన్న, గంధం శ్రీనివాస్‌, నిర్వహకుడు నాగరాజులు పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండలంలో  మహిళలు ఉదయం పూట తమ వాకిళ్లలో రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. పిండి వంటలు చేసి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. సిర్పూర్‌(యూ) మండలంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు  శుక్రవారం కనుమ పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. బెజ్జూరు మండలంలో  మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి నోములు నోచుకున్నారు. హరిదాసు సంకీర్తనలు చేస్తూ గంగిరెద్దులతో వీధి వీధిన తిరుగడంతో  సందడి నెలకొంది.  దహెగాం మండలంలోని  ఐనం గ్రామంలోని శివాలయం ఆవరణలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన శీరిష, అఖిల, మనీషలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సందీప్‌, ప్రధానోపాధ్యాయుడు సంజీవ్‌, ఉపాధ్యాయులు సంతోష్‌, నాయకులు నానాజీ తదితరులు పాల్గొన్నారు. పెంచికలపేట మండలంలో పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2021-01-16T04:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising