ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమైన సమ్మక్క-సారలమ్మ జాతర

ABN, First Publish Date - 2021-02-25T06:16:32+05:30

నిర్మల్‌జిల్లా ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ తండాలోని గుట్టలో వెలసిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది,

మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొదటి రోజుమొక్కులు తీర్చుకున్న భక్తులు

బోనం ఎత్తిన ముస్లిం భక్తురాలు

ముథోల్‌, ఫిబ్రవరి 24 : నిర్మల్‌జిల్లా ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ తండాలోని గుట్టలో వెలసిన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ప్రారంభమైంది, దేవాలయ పూజారి జాదవ్‌ రేణుకమ్మ, దేవాలయ ధర్మకర్త జాదవ్‌ సతీష్‌లు  భాజాభజంత్రీల మధ్య ఎడ్‌బిడ్‌ తండా నుంబొ రాజేష్‌ తండాలో వెలసిన సారలమ్మకు భోనాలు తీసుకువెళ్లారు. కనకవనంను తీసుకవచ్చారు. ఆనంతరం సారలమ్మ, సమ్మక్క గద్దెల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది, భక్తులు ఉమ్మడి అదిలాబాధ్‌ జిల్లా నుండి కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తు లు తరలివచ్చి వనదేవతలకు భక్తి శ్రధ్దలతో మొక్కులను తీర్చుకున్నారు. మొక్కిన మొక్కులు నెరవేరాలని నిలువెత్తు(బంగారం)ను అమ్మవారికి సమర్పించారు. 

మరికొందరూ మేకలను బలిఇచ్చారు. ఈ జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచే ఆయా ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భం గా పలువురు శివసత్తులు పూనకంతో ఊగారు. ఇది ఇలా ఉండగా  మొ క్కిన ముక్కులు తీర్చే వనదేవతను  కుంటాల మండలంకు చెందిన ముస్లిం మహిళా భక్తురాలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆ భక్తురాలు భోనమెత్తి వనదేవతలకు సమర్పించారు.  ఈ సమ్మక్క సారలమ్మలకు నేను మొక్కిన మొక్కులు తీరడంతో  మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. 

Updated Date - 2021-02-25T06:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising