ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారి వైద్యానికి సఖి సిబ్బంది చేయూత

ABN, First Publish Date - 2021-09-18T03:54:30+05:30

మంచిర్యాల సఖి కేంద్రం సిబ్బంది 6 రోజుల పసిపాప వైద్యానికి చేయూతనందించి ఔదార్యం చాటుకున్నారు. మహారాష్ట్రలోని సిరొంచ జిల్లా బెజ్జురుపల్లి గ్రామానికి చెందిన సోని, మల్లేష్‌ దంపతుల పాపకు శ్వాసకు సంబంధించిన ఇబ్బంది తలెత్తడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి శుక్రవారం తీసుకువచ్చారు. ఆసుపత్రి సిబ్బంది కరీంనగర్‌కు తీసుకువెళ్ళాలని సూచించారు.

పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న సఖి సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, సెప్టెంబరు 17: మంచిర్యాల సఖి కేంద్రం సిబ్బంది 6 రోజుల పసిపాప వైద్యానికి చేయూతనందించి ఔదార్యం చాటుకున్నారు. మహారాష్ట్రలోని సిరొంచ జిల్లా బెజ్జురుపల్లి గ్రామానికి చెందిన సోని, మల్లేష్‌ దంపతుల  పాపకు శ్వాసకు సంబంధించిన ఇబ్బంది తలెత్తడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి శుక్రవారం తీసుకువచ్చారు. ఆసుపత్రి సిబ్బంది కరీంనగర్‌కు తీసుకువెళ్ళాలని సూచించారు. చేతిలో డబ్బులు లేక, తెలిసిన వారు కానరాక దిక్కుతోచని స్థితిలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక సఖి సెంటర్‌ ఎదురుగా కూర్చుండిపోయారు. వారిని గమనించిన సఖి సెంటర్‌ సిబ్బంది విషయం ఆరా తీయగా పాపకు శ్వాస సమస్యతోపాటు, ఫిట్స్‌ వచ్చినట్లు తెలుసుకున్నారు. పాపకు తక్షణమే వైద్యం అవసరమైనందున పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సఖి సెంటర్‌ నిర్వాహకురాలు శ్రీలత తెలిపారు. పాప చికిత్సకు సఖి సెంటర్‌ సిబ్బందితోపాటు అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా చేయూతనందించినట్లు తెలిపారు.   

Updated Date - 2021-09-18T03:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising