ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలి

ABN, First Publish Date - 2021-06-19T05:30:00+05:30

పెట్రోల్‌, డీజిల్‌ , వంటగ్యాస్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని సీపీఐయంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న డిమాండ్‌ చేశారు.

పెంచిన ధరలను తగ్గించాలని నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన 

నిర్మల్‌టౌన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : పెట్రోల్‌, డీజిల్‌ , వంటగ్యాస్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని సీపీఐయంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపు మేరకు శనివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో శివాజీచౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నారన్నారు. పెట్రోల్‌, డిజిల్‌, వంటగ్యాస్‌ సిలెండర్ల ధరలు, నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపుగా పెరిగిన పాలకులకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. తమ రాజకీయ  ప్రయోజనాల కోసమే ఎన్నికలు, మత సంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలని కరోనాకు బలి చేస్తున్నారన్నారు. లక్షల కోట్ల రూపాయలను ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం లక్షల కోట్లు పన్ను మినహాయింపు ఇవ్వడమేంటన్నారు. పెంచిన ధరలను వెం టనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐకేయంయస్‌ జిల్లా అధ్యక్షులు నందిరామయ్య, కార్యదర్శి జె.రాజు, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి నూతన్‌కుమార్‌, ఐఎఫ్‌టీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బక్కన్న, రాం లక్ష్మణ్‌, పీఓడబ్య్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హరిత, ఎఐకేయంయస్‌ జిల్లా కార్యదర్శి ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising