ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని రాస్తారోకో

ABN, First Publish Date - 2021-06-22T04:15:09+05:30

బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులు సోమవారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని జాతీయ రహ దారిపై రాస్తారోకో నిర్వహించారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయడానికి బెల్లంపల్లిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలతోపాటు అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్‌ కళాశాల భవనం అం దుబాటులో ఉందన్నారు.

బెల్లంపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఆయా పార్టీల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, జూన్‌ 21 : బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులు సోమవారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని జాతీయ రహ దారిపై రాస్తారోకో నిర్వహించారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయడానికి బెల్లంపల్లిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలతోపాటు అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్‌ కళాశాల భవనం అం దుబాటులో ఉందన్నారు. ప్రభుత్వం బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయకుంటే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. టూటౌన్‌ పోలీ సులు రాస్తారోకో వద్దకు చేరుకుని నచ్చజెప్పి విరమింపజేశారు. నాయకులు ఏమాజీ, సూరిబాబు, శ్రీదేవి, రాజులాల్‌యాదవ్‌, రమేష్‌, కుంబాల రాజేష్‌, కొలిపాక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

జిల్లాకు కేటాయించిన మెడికల్‌ కళాశాలను బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని సోమవారం మెడికల్‌ కళాశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వినతిపత్రం అందించారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లానని ఎమ్మెల్యే తెలిపారు.  

బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శి మునిమంద రమేష్‌ సంఘీభావం తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ రెండు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బెల్లం పల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాధ్యక్షుడు కోడి రమేష్‌, ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్‌, నాయకులు కోడి సురేష్‌ పాల్గొన్నారు. 

బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు   ఆర్డీవో, తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్‌లకు వినతి పత్రాలు అందించారు. బడికెల శ్రావణ్‌, కృష్ణదేవరాయలు, సబ్బని రాజేంద్ర ప్రసాద్‌, సాగర్‌, మురళీ, ఆదర్శ్‌, ప్రవీణ్‌, సాయి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T04:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising