ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-10-28T03:44:32+05:30

నిర్మల్‌ జిల్లాలోని బైంసా పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని దళితసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహకూల్చివేతను నిరసిస్తూ బుధ వారం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తా రోకో చేశారు.

ఆసిఫాబాద్‌లో రాస్తారోకో చేస్తున్న దళిత సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, అక్టోబరు 27: నిర్మల్‌ జిల్లాలోని బైంసా పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని దళితసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ విగ్రహకూల్చివేతను నిరసిస్తూ బుధ వారం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే విగ్రహాల వద్ద రక్షణ కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్‌, బేడ బుడగ జంగాల, ఇతర కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కఠినంగా శిక్షించాలి..

వాంకిడి: భైంసా పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బుధవారం మండల కేంద్రంలో అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వాంకిడి సర్పంచు బండె తుకారం, అంబేద్కర్‌ సంఘం ఆసిఫాబాద్‌ సెంటర్‌ కమిటీ అధ్యక్షుడు అశోక్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T03:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising