ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూలాజీబాబా ఆశయ సాధనకు కృషి

ABN, First Publish Date - 2021-02-25T04:07:06+05:30

సద్గురు శ్రీ పూలాజీబాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు.

ధ్యానకేంద్రాన్ని ప్రారంభిస్తున్న జడ్పీచైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

వాంకిడి, ఫిబ్రవరి24: సద్గురు శ్రీ పూలాజీబాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి  చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్మించిన పూలాజీబాబా ధ్యాన కేంద్రాన్ని ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా పూలాజీబాబా చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మికతోనే మానవునిలో మానసిక ప్రశాంతత ఏర్పడు తుందన్నారు. పూలాజీబాబా ప్రవచనాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ప్రజలు వ్యసనాలకు దూరంగా ఉండి మంచిమార్గాన్ని ఎంచుకో వాలన్నారు. మండలంలో నిర్మించిన ధ్యాన కేంద్రం లో ప్రతి రోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేప ట్టాలని చైర్‌పర్సన్‌ సూచించారు. ఈ కార్యక్ర మంలో ఎంపీపీ ముండె విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంటు, సర్పంచు బండె తుకారాం, ఉపసర్పంచు పవన్‌ సాయి, ధ్యాన కేంద్రం కమిటీ సభ్యులు దయాకర్‌, బాబురావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising