ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2021-04-13T05:56:40+05:30

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని కొలాంగూడలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.

కొలాంగూడలో కమ్యూనిటీహాల్‌ను ప్రారంభిస్తున్న రేఖానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, ఏప్రిల్‌ 12: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని కొలాంగూడలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొలాం గిరిజనుల గ్రామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ఐటీడీఏ ద్వారా కృషి చేస్తున్నామని అన్నారు. ఆదిమ గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యలో పీవీటీజీల సంక్షేమానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి  నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిప్రగతి పథకాన్ని ఉపయోగించుకొని గిరిజనులు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను పొందాలన్నారు. అలాగే ఉట్నూర్‌లో దంతన్‌పల్లికి చెందిన షాహిన్‌కు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం  మండల అధ్యక్షుడు అహ్మద్‌ అజిమొద్దీన్‌, దాసండ్ల ప్రభాకర్‌, జూవ్వాద్‌ అన్సారీ, మునీర్‌, పోశన్న, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి పథకంతో పేదలకు అండ..

ఇంద్రవెల్లి: కల్యాణ లక్ష్మి పథకంతో నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్‌ యార్డులో కొవిడ్‌ 19 నిబంధనలు పాటిస్తూ 52 మందికి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, గ్రామాల్లో 45 యేళ్ల పైబడిన వారందరు కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, ఎంపీడీవో పుష్పలత, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అంజద్‌, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం చైర్మన్‌ డోంగ్రే మారుతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాథోడ్‌ మోహన్‌నాయక్‌, మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కోరెంగ గాంధారిసుకంట్‌రావు, ఎంపీటీసీ సభ్యురాలు జాదవ్‌ స్వర్ణలత, మండల నాయకులు షేక్‌ సూఫియాన్‌, కాలే శివాజీ, ఆరేళ్లీ రామదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising