ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గాంధీ జయంతి

ABN, First Publish Date - 2021-10-03T06:42:28+05:30

జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి అనదపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కలెక్టరేట్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లావ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
నివాళ్లు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు  

నిర్మల్‌ టౌన్‌, అక్టోబరు 2: జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి అనదపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. ఇందులో జిల్లా అధికారులు, కలెక్టర్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్‌ కల్చరల్‌: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని అడిషనల్‌ ఎస్పీ రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులోఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, ఆర్‌ఐ వెంకటి, ఎంటీవో కృష్ణాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నిర్మల భారతీ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ పార్క్‌లోని గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తోడిశెట్టి పరమేశ్వర్‌, అంబటి నారాయణ, రవికాంత్‌, వెంకట్‌, తదితర కళాకారులు పాల్గొన్నారు.  
సోన్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. స్థానిక గాంధీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దస్తూరాబాద్‌: మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కిషన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ పద్మావతి, బుట్టాపూర్‌, భూత్కూర్‌, దస్తూ రాబాద్‌, గొడిసిర్యాల్‌, మున్యాల్‌, మున్యాల్‌ తండా, రేవోజీపేట్‌, మల్లాపూర్‌ దేవునిగూడెం, గొడిసిర్యాల్‌ గోండుగూడ గ్రామ పంచాయతీలలో స్థానిక సర్పంచ్‌ లు, బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శారదా శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ రాజు నాయక్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
కడెం: మండలంలోని కొండుకూర్‌ గ్రామంలో గాంధీ జయంతిని వైస్‌ ఎంపీపీ కళ్లె రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా శ్రమదానం చేసి, స్థానికులకు ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించారు. అలాగే, స్థానకి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అలాగే,  గాంధీ జయంతి సందర్భంగా  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్‌ గుప్తా, ప్రచార కార్యదర్శి కే.మల్లారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహనికి నివాళులు అర్పించారు.  
దిలావర్‌పూర్‌: గాంధీ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామా ల్లోని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎలాల అమృత, ఎంపీడీవో మోహన్‌, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, తదితరుల్గున్నారు.  
ఖానాపూర్‌: మండల కేంద్రంలోని శనివారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ప్రజ లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో గల  గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేశారు. అనంతరం మహాత్ముని సేవలను స్మరించుకున్నారు. గాంధీ జయంతిని పురష్కరించుకుని మున్సిపల్‌ కార్యాలయంలోని పారిశుధ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం, వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఖానాపూర్‌ రూరల్‌: మండలంలో గాంధీ జయంతి సందర్భంగా ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించి నివాళులర్పించారు. పాత ఎల్లాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ అం బటి స్వప్న చంద్రయ్య ఆద్వర్యంలో గ్రామ పంచాయతి కార్యాలయంలో గాంధీ మహాత్ముడి చిత్ర పటానికి పూలంకరణ చేసి నివాళులర్పించారు.
లక్ష్మణచాంద: గాంధీ జయంతిని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అలాగే ఆయా గ్రామాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.
పెంబి: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో సర్పంచ్‌ శేఖర్‌ గౌడ్‌, ఎంపీవో చిక్యాల రత్నాకర్‌ రావు, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు పుప్పాల రమేష్‌, తదితరులు ఉన్నారు.
సారంగాపూర్‌: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శనివారం గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహత్మా గాంధీ విగ్రహలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
భైంసా: భైంసాలో శనివారం గాంధీ, దివంగత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురష్కరించుకొని స్థానిక గాంధీ గంజ్‌ ఆవరణలో గల పూజ్య బాపూజీ విగ్రహానికి ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి. కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి. రమాదేవి, భైంసా పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలాజీ సూత్రావేలు వేరువేరుగా తమ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పి.  రమాదేవి నేతృత్వంలో లాల్‌ బహదూర్‌శాస్త్రీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
భైంసా రూరల్‌: మండలంలోని వానల్‌పాడ్‌, పెండ్‌పెల్లి, లింగా, ఖత్‌గాం, మహగాం, తిమ్మాపూర్‌, సుంక్లి గ్రామాలతో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తానూర్‌: మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గాంధీ  జయంతిని ఘనంగా నిర్వహించారు.  
కుభీర్‌: మండలం కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో 152వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కుంటాల: మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంతో పాటు అన్ని గ్రామాల్లో శనివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. 

Updated Date - 2021-10-03T06:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising