ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మహమ్మారి నుండి ఆర్టీసీ కార్మికులను కాపాడండి

ABN, First Publish Date - 2021-05-12T06:47:16+05:30

కరోనా రెండోదశ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులకు ఫ్రంట్‌లైన్‌ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికసంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం నిర్మల్‌ డిపో ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.

నిర్మల్‌ డిపో ముందు ఆర్టీసీ కార్మిక సంఘాల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ డిపో ముందు కార్మిక సంఘాల నిరసన

నిర్మల్‌ టౌన్‌, మే 11 : కరోనా రెండోదశ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులకు ఫ్రంట్‌లైన్‌ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికసంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు మంగళవారం నిర్మల్‌ డిపో ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రయాణికులతో సన్నిహితంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న కార్మికులు కరోనాసోకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ప్రాణాలు కోల్పోయినా, దాదాపు 3 వేల మంది కరోనాతో క్వారంటైన్‌లో కాలం గడుపుతున్నా యాజమాన్యం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్ట లేదన్నారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా బారిన పడుతున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు తార్నాకలో ప్రత్యేక కొవిడ్‌సెంటర్‌, ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని, బస్సులలో శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, భౌతికదూరం ఉండేలా సీట్లు ఏర్పా టు చేయాలని, తార్కాక ఆసుపత్రిలో ప్రత్యేక కొవిడ్‌వార్డు, వెంటిలేటర్‌, ఐసీయూ బెడ్స్‌, ఆక్సిజన్‌ తదితర సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యం అందించాలని, రెఫరల్‌ ఆసుపత్రులలో చికిత్స అందించాలని, మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వాలని, కరోనా సోకిన వారికి 21 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వాలని, చనిపోయిన వారికి 50 లక్షల బీమా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, డ్యూటీకి రిపోర్ట్‌ చేసిన వారికి హజరు ఇవ్వాలని, కార్మి కులందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు కే. రమేష్‌, జి. రాజేశ్వర్‌, నారాయణ, నవాబ్‌, సీహెచ్‌. రమేష్‌, నాగమణి, రేకోబా, భోజన్న, సలీం, మౌలానా, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-12T06:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising