ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలను సకాలంలో పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-12-16T04:03:39+05:30

మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌, జడ్పీ టీసీ అరిగెల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 15: మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీపీ మల్లికార్జున్‌యాదవ్‌, జడ్పీ టీసీ అరిగెల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్లికార్జున్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ఈ సమా వేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సంద ర్భంగా సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసు కువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా చూడాల న్నారు. గ్రామాల్లో ప్రారంభించే అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి పంటను వేయకుండా ఆరుతడిపంటలను పండించేలా రైతు లకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. రైతుబంధు పథకం మండలంలోని కొంతమం దికి అందడం లేదని, వారిని గుర్తించి అందేలా చూడా లని సూచించారు. మండలంలోని ప్రతిగ్రామంలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీళ్లు సరఫరా చేయాల న్నారు. మండలంలోని మారుమూల ప్రాంతాలకు కొత్త రేషన్‌ షాపులు మంజూరుచేసి సరుకులు అందజేయా లన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను సరి చేయాలని తదితర సమస్యలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభదృష్టికి తీసుకువచ్చారు. సమావే శంలో ఎంపీడీవో శశికళ, సింగిల్‌ విండోచైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T04:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising