ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములకు పట్టాలివ్వాలి

ABN, First Publish Date - 2021-08-03T05:03:02+05:30

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు లక్షా యాభై వేల మంది ఆదివాసీ రైతులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, రైతు బంధు, రైతుబీమా, రుణ సౌకర్యం వంటి పథకాలను కల్పించి వారిని ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు.

పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న పాయల శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, ఆగస్టు 2: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు లక్షా యాభై వేల మంది ఆదివాసీ రైతులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, రైతు బంధు, రైతుబీమా, రుణ సౌకర్యం వంటి పథకాలను కల్పించి వారిని ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ఇచ్చోడ-సిరికొండ రోడ్డు పనులను కేసీఆర్‌ బంధువుకు చెందిన సీ5 గుత్తేదారు దక్కించుకొని పనులు పూర్తి చేయకుండా వదిలివేయడంతో మండల వాసులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బోయిన్‌వాడ్‌ అమోల్‌, ఎంపీపీ పెందూర్‌ అమృత్‌రావ్‌, నాయకులు కుమ్ర రఘురాం, మానిక్‌రావ్‌, సంటి భూమన్న, ఉయిక సీతారాం, రమేష్‌, కదం బాపురావ్‌ పాల్గొన్నారు.

పోడు రైతులను ఆదుకోవాలి

భీంపూర్‌, ఆగస్టు 2: గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి సోమవారం తహసీల్దార్‌ సోముకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు రైతులకు రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు వర్తింపచేయాలని కోరారు. తాము గ్రామాల్లో తిరుగుతూ ఆదివాసీ రైతులకు పోడు భూముల విషయంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కొడప సురేష్‌, దాదారావ్‌, నిర్మలబాయ, రంజనబాయి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising