ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN, First Publish Date - 2021-10-24T04:22:54+05:30

ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రెండో అదనపు జిల్లా జడ్జి వెంకటేష్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఆర్థిక స్ధోమత లేని వారు ఉచితంగా న్యాయ సహాయం పొందేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న రెండో అదనపు జిల్లా జడ్జి వెంకటేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, అక్టోబరు 23: ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రెండో అదనపు జిల్లా జడ్జి వెంకటేష్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. ఆర్థిక స్ధోమత లేని వారు ఉచితంగా న్యాయ సహాయం పొందేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు. మహిళ లు రక్షణ చట్టాలపై అవ గాహన పెంచుకోవాల న్నారు. ఆజాదీకాఅమృత్‌ మహోత్సవంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. క్షణికావేశానికి లోనై గొడవలకు పాల్పడకుండా పోలీసులను, కోర్టును ఆశ్ర యించాలని  కోరారు. న్యా యవాదులు సదానం దం, శిల్పికశర్మ, తాజుద్దీన్‌, ఎస్‌ఐ దేవయ్య పాల్గొన్నారు.

జైపూర్‌: మహిళలు చట్టాలపై అవగాహన కలి గి ఉండాలని జిల్లా ఎక్సైజ్‌ ఫస్ట్‌క్లాస్‌ జడ్జి సుమన్‌గ్రే వాల్‌ పేర్కొన్నారు. ఐకేపీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మహిళలకు ఏదైనా సమస్య వచ్చి నప్పుడు డయల్‌ 100కు ఫోన్‌ చేసి సహాయం పొందా లన్నారు. పేద ప్రజలకు మండల లీగల్‌ సర్వీసు కమి టీ ద్వారా ఉచితంగా న్యాయం జరుగుతుందని పేర్కొ న్నారు. డిస్ర్టిక్‌ కోర్టు అడ్వకేట్‌ శిల్పిక శర్మ, సీనియర్‌ న్యాయవాది సదానందం, న్యాయవాదులు రాజారమేష్‌, తాజుద్దీన్‌, సీఐ రాజు, ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు. 

 కోటపల్లి: ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేషంగౌడ్‌లు కోరా రు. శనివారం సిర్సా గ్రామంలో న్యాయ విజ్ఞాన సద స్సు ఏర్పాటుచేశారు. భూతగాదాలు, రెవెన్యూ కేసులు, ఉచిత న్యాయసేవలపై ప్రజలకు అవగాహన కల్పిం చారు. సర్పంచు పున్నంచంద్‌, బార్‌ అసోసియేషన్‌ లీగల్‌ ప్యానల్‌ మెంబర్‌ రమేష్‌, న్యాయవాదులు కార్తీక్‌, మహేష్‌, లక్ష్మణ్‌,  మహేష్‌లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-24T04:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising