ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి ఆపరేషన్‌ స్మైల్‌ : అదనపు ఎస్పీ

ABN, First Publish Date - 2021-12-31T06:27:14+05:30

వచ్చే 2022 జనవరి 1 నుంచి 31వరకు నెల రోజుల పాటు జిల్లాలో ఆపరేషన్‌ స్మైల్‌-8 కొనసాగుతుందని అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. తప్పి పోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేరవేయడమే ఈ ఆపరేషన్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 30: వచ్చే 2022 జనవరి 1 నుంచి 31వరకు నెల రోజుల పాటు జిల్లాలో ఆపరేషన్‌ స్మైల్‌-8 కొనసాగుతుందని అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. తప్పి పోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేరవేయడమే ఈ ఆపరేషన్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు హెడ్‌క్వాటర్‌లో జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్‌ స్మైల్‌ 8వ విడతకు సంబంధించిన కో ఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి యేడాది జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలై ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. బాల కార్మికులకు విముక్తి కలిగించేలా ఈ బృందాలు పని చేస్తాయన్నారు. జనవరి నెల నుంచి ఆపరేషన్‌ స్మైల్‌ ప్రారంభంకానుందని బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారి పై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని రెండు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఒక ఎస్సై, నలుగరు కానిస్టేబుళ్లతో రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధేశాల్లో ఇటుక బట్టీలు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, వ్యాపార సముహాలు, చిన్న చిన్న పరిశ్రమలను  వంటి ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో అందరు సమన్వయంతో పని చేయాలని కోరారు. సమావేశంలో డీసీపీఓ రాజేంద్రప్రసద్‌, సీడబ్ల్యుసీ చైర్మన్‌ వెంకటస్వామి, లేబర్‌ అధికారి జి.వినోద్‌, డీసీపీఓ అధికారి రమేష్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ గుణవంత్‌రావు తదితరులున్నారు.

Updated Date - 2021-12-31T06:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising