ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

117 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు!

ABN, First Publish Date - 2021-10-25T05:18:09+05:30

ఏడు తరగతులు.. 117మంది విద్యార్థులు.. కానీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు..! ఇదీ.. భీంపూర్‌ మండలం అంతర్‌గాం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి.

అంతర్‌గాం పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న హెచ్‌ఎం శ్రీకాంత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్‌గాం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు

ఏడు తరగతులు, 117 మంది విద్యార్థులు

కరోనా నేపథ్యంలో పాఠశాలకు పెరిగిన విద్యార్థుల సంఖ్య

భీంపూర్‌, అక్టోబరు 24 : ఏడు తరగతులు.. 117మంది విద్యార్థులు.. కానీ ఒకే ఒక్క ఉపాధ్యాయుడు..! ఇదీ.. భీంపూర్‌ మండలం అంతర్‌గాం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి. పాఠశాలలో ఏడో తరగతి వరకు ఉండగా.. ఏకైక ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌తోనే విద్యార్థులకు బోధన కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో.. గ్రామంలోని ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 50మంది లోపే ఉన్న విద్యార్థుల సంఖ్య.. ఇప్పుడు ఏకంగా 117కు చేరింది. అయితే ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో.. బోధన అంతంత మాత్రంగానే సాగుతోంది. గతేడాది ఈ పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. మళ్లీ ఉపాధ్యాయులెవరూ రాకపోవడంతో.. పాఠశాలలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు శ్రీకాంత్‌ పైనే భారం పడింది. ఈ నేపథ్యంలో అంతర్‌గాం పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని గ్రామ సర్పంచ్‌ బక్కీ లలిత, విద్యాకమిటీ చైర్మన్‌ షేక్‌ ఖాదర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2021-10-25T05:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising