ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలేవి?

ABN, First Publish Date - 2021-10-30T03:56:27+05:30

గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా పాలవర్గాలను ఎన్నుకున్న పంచాయతీలకు ప్రోత్సాహకంగా నజనారాలు ప్రకటించిం ది

పాలకవర్గం ఏకగ్రీవం చేసుకున్న చింతలమానేపల్లి మండలం ఆడిపెల్లి గ్రామ పంచాయతీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో 49 ఏకగ్రీవం

- పాలకవర్గాలకు తప్పని నిరీక్షణ 

చింతలమానేపల్లి, అక్టోబరు 29: గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యతను  పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా పాలవర్గాలను ఎన్నుకున్న పంచాయతీలకు ప్రోత్సాహకంగా నజనారాలు ప్రకటించిం ది. ఈ మేరకు 2019 జనవరిలో జరిగిన పల్లెపోరు (పంచాయతీ ఎన్నికలు) లో జిల్లాలో చాలా పంచాయతీలు పాలక వర్గాలను ఏకగ్రీ వం చేసుకు న్నాయి. దీంతో ప్రభుత్వం అందించే నజరానా నిధులతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని భావించారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 7 లక్షలు అందజేయగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన 2019 పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షల నజరానాతో పాటు, స్థానిక ఎమ్మెల్యే నిధుల నుంచి  రూ. 5 లక్షలు మొత్తం 15 లక్షల నిధులు సమకూరుతాయని హామీ ఇచ్చారని పలువురు సర్పంచులు చెబుతున్నారు. కాగా ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పోత్సాహక నిధులు ఇస్తామని చెప్పలేదని అది తమ ప్రభత్వ పాలసీలోనే లేదని ప్రకటించారు. దీంతో  ఏకగ్రీవ పాలకవర్గ సర్పంచులు అసంతృప్తికి గురవుతున్నారు. నిధులు వస్తే గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాయని భావించినా నిరాశ తప్పలేదు. ఏకగ్రీవ పంచాయతీల పాలకవర్గాలు కొలువు దీరి మూడేళ్లు కావస్తున్నా నిధుల ఊసేలేకపోవడంతో నిరుత్సాహం చెందుతున్నాయి.

 జిల్లాలో 334 పంచాయతీలు..

జిల్లాలో మొత్తం 334 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 49 పంచా యతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల్లో అనవసర ఖర్చు నివార ణతో పాటు, ఏకగ్రీవంగా వచ్చే నిధుల ద్వారా గ్రామాలను మరింత అభి వృద్ధి చేసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో గ్రామస్థులందరూ ఐక్యంగా ముందుకొ చ్చా రు. ప్రస్తుతం పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధుల నుంచి  విడతల వారీగా జనాభా ప్రాతిపాదికన పంచా యతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వాటిని సర్పంచులు వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్యం, పల్లెల అభివృద్ధి పనులు తదితర వాటికి ఖర్చు చేస్తున్నారు.  ప్రోత్సాహక నిధులు వస్తే గ్రామాల్లో కొంత మేరకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టవచ్చని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. ఏళ్లు గడుస్తున్నా నజరానా రాకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

- మండలాల వారీగా..

జిల్లాలో మండలాల వారీగా ఏకగ్రీవ పంచాయతీలు ఇలా ఉన్నాయి.  కౌటాల మండలంలో తలోడి, కన్కి, శిర్సా, నవేగాం గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బెజ్జూరు మండలంలో అంబగట్టు, సుస్మీర్‌, కాటేపల్లి, తలాయి, సులుగుపల్లి, అందుగులగూడ, కుకుడ, పెంచికలపేట మండలంలో కొండపల్లి, మొర్లిగూడ, దహెగాం మండలంలో ఐనం, దిగిడ, రాంపూర్‌, చింతలమానేపల్లి మండలంలో ఆడిపెల్లి పంచాయ తీలను ఏకగ్రీవం చేసుకున్నారు. తిర్యాణి మండలంలో భీంజిగూడ, గోవెన, మర్కగూడ, గోపెర (నాగుగూడ), మొర్రిగూడ, గుండాల, ముల్క లమంద, రెబ్బెన మండలంలో తక్కళ్లపల్లి, కాగజ్‌న గర్‌ మండలంలో అనుకోడ, భట్టుపల్లి, ఈసుగాం, జగన్నాథ్‌పూర్‌, లైన్‌గూడ, రేగులగూడ ఏకగ్రీవమయ్యాయి. కెరమెరి మండలంలో కరంజీవాడ, రింగన్‌ఘాట్‌, వాంకిడి మండలంలో దాబా, నవేగూడ, పాటగూడ, పిప్పర్‌గొంది, సవ్వాతి, సిర్పూర్‌(యూ) మండలంలో బాండేయర్‌, సీతాగొంది, లింగా పూర్‌ మండలంలోని గుమ్నూర్‌(బి), చిన్న దాంపూర్‌ ఏకగ్రీవమయ్యా యి. జైనూరు మండలంలో రాంనాయక్‌ తండా, దుబ్బగూడ, మార్లవా యి, పారా, పవర్‌గూడ, రాశిమెట్ట, ఊసేగాం పంచాయతీలు ఏకగ్రీవ మ య్యాయి. నిధులు విడుదలైతే మౌలిక సదుపాయాల కల్పనకు అవ కాశం ఉంటుంది.

అభివృద్ధి కోసం ఏకగ్రీవం..

- ఉపాసి సంజీవ్‌, సర్పంచ్‌, కొండపల్లి

ప్రభుత్వం అందజేస్తామన్న ప్రోత్సాహక నిధులతో గ్రామాన్ని అభి వృద్ధి చేసుకోవచ్చని ఏకగ్రీవం చేసుకున్నాం. అయితే ఇటీవల ముఖ్యమం త్రి అసెంబ్లీలో ఏకగ్రీవ పంచాయతీలకు ఎలాంటి నిధులు ప్రత్యేకంగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని ప్రకటించడంతో పాలవర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ప్రోత్సాహక నిధులు ఇస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడతాయి. ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలి. 

Updated Date - 2021-10-30T03:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising