ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై వంటావార్పు

ABN, First Publish Date - 2021-06-24T04:51:30+05:30

ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన మెడికల్‌ కళాశాలను బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని మెడికల్‌ కళాశాల సాధన సమితి సభ్యులు రైల్వేస్టేషన్‌ వద్ద జాతీయ రహదారిపై వంటా వార్పు చేసి భోజనాలు చేశారు

బెల్లంపల్లి జాతీయ రహదారిపై భోజనాలు చేస్తున్ననాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మెడికల్‌  కళాశాల ఏర్పాటు చేయాలని నాయకుల డిమాండ్‌
బెల్లంపల్లి, జూన్‌ 23:  ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన మెడికల్‌ కళాశాలను బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని మెడికల్‌ కళాశాల సాధన సమితి సభ్యులు రైల్వేస్టేషన్‌ వద్ద జాతీయ రహదారిపై వంటా వార్పు చేసి భోజనాలు చేశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెడికల్‌ కళాశాల సాధన సమితి సభ్యులతో పాటు స్వచ్చంద సంఘాలు, పార్టీల నాయకులు, ఆర్యవైశ్య, విద్యార్ధి సంఘాల నాయకులు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కళాకారులు, మాజీ సర్పంచ్‌లు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అభినవ సంతోష్‌కుమార్‌, చిప్ప మనోహర్‌, రొడ్డ శారద, రమాదేవి, మధుకర్‌,రేణికుంట్ల శ్రీనివాస్‌, శ్రావణ్‌కుమార్‌, మాదరి రాకేష్‌, రాంచందర్‌, రాజేష్‌, బద్రి వెంకటేష్‌, తిరుపతి, రంగ సాగర్‌, నాగరాజు, నవీన్‌, విజయ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ఐక్య విద్యార్థి సంఘాల వినతి
బెల్లంపల్లిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌,  రాష్ట్ర సీఎం, కేంద్ర విద్యాశాఖ మంత్రి, మంత్రి కేటీఆర్‌కు రిజిస్టర్‌ పోస్టు ద్వారా వినతి పత్రాలు పంపించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బడికెల శ్రావణ్‌, చిలుముల కృష్ణదేవరాయలు, నాయిని మురళీశ్రావణ్‌, ఆదర్శ్‌వర్ధన్‌రాజు, పసుపులేటి వెంకటేశ్‌, శివ, కొండశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising