ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నులపండువగా ముజ్గి మల్లన్న జాతర

ABN, First Publish Date - 2021-03-01T05:36:39+05:30

మండలంలోని ముజ్గి గ్రామంలో ఆదివారం మల్లన్న జాతర కన్నులపండువగా జరిగింది. గత 3రోజులుగా నిర్వహిస్తున్న జాతర చివరిరోజు కా

గర్భగుడిలో మల్లన్న మూలవిరాట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలాదిసంఖ్యలో తరలివచ్చిన భక్తజనం.. కొనసాగిన అన్నదానం

నిర్మల్‌ రూరల్‌, ఫిబ్రవరి 28: మండలంలోని ముజ్గి గ్రామంలో ఆదివారం మల్లన్న జాతర కన్నులపండువగా జరిగింది. గత 3రోజులుగా నిర్వహిస్తున్న  జాతర చివరిరోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వచ్చిన భక్తులు మల్లన్నను దర్శించికుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అలాగే, మహిళలు అధికసంఖ్యలో మల్లన్న దేవుడికి బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామస్థులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర చివరిగట్టంలో భాగంగా మల్లన్న దేవాలయం చుట్టూ యాదవుల ఆచారం ప్రకారం పల్లకిని(రథం) తిప్పారు. జాతరకు పలువురు బీజేపీ జిల్లా నాయకులు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్పాల గణేష్‌ చక్రవర్తి, అప్పాల ప్రభాకర్‌, మాజీ కౌన్సిలర్‌ అయ్యన్న గారి పోశెట్టి, నేళ్ళ అరుణ్‌, మండల నాయకులు గోపీ, సాయన్న, ధర్మన్నలతో పాటు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

మల్లన్న జాతరలో ప్రమాదవశాత్తు పల్లకి ఊరేగింపులో ఓ మహిళా కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైనట్లు రూరల్‌ ఎస్సై కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మల్లన్న జాతరలో పల్లకిని ఊరేగిస్తున్న సమయంలో పల్లకి ముందుభాగం తగలడంతో మహిళా కానిస్టేబుల్‌ నందినికి తీవ్ర గాయాలవగా, మరొకరికి స్పల్ప గాయాలయ్యాయి. కాగా, మహిళా కానిస్టేబుల్‌  పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌కు తరలించారు.

Updated Date - 2021-03-01T05:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising