ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలి

ABN, First Publish Date - 2021-08-05T04:17:38+05:30

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని జిల్లా మహిళా కాంగ్రెస్‌ విభాగం అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణాధ్యక్షురాలు గడ్డం రజనీ అన్నారు.

నియామక పత్రాలు అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-పార్టీ అభివృద్ధి కోసమే మహిళ నూతన కమిటీలు
మందమర్రిటౌన్‌, ఆగస్టు 4: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని జిల్లా మహిళా కాంగ్రెస్‌ విభాగం అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణాధ్యక్షురాలు గడ్డం రజనీ అన్నారు. బుధవారం స్ధానిక మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో సాధించింది శూన్యమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత పార్టీలో నూతన ఉత్తేజం నెలకొందన్నారు. పట్టణంలోని సమస్యలపై పోరాటాలు చేసేందుకు మహిళ నూతన కమిటీలను ఎన్నుకున్నామని తెలిపారు.  సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు రఘునాధ్‌రెడ్డి, రాజన్న, ఎండీ ముజాయిద్‌ ,అనూష, రమేష్‌, శ్రీనివాస్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ పట్టణ మహిళ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా ఎన్‌. రాధ, బైరినేని సునీత, ప్రధాన కార్యదర్శులుగా తాటికొండ కవిత, దాసరి స్రవంతి, కార్యదర్శులుగా లక్ష్మీ, శ్రీదేవి, శైలజ, రేణుకను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు.

Updated Date - 2021-08-05T04:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising