ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శనగలను కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2021-03-25T05:11:34+05:30

యాసంగిలో రైతులు సాగు చేసిన శనగ పంటను ఎకరానికి తొమ్మిది క్వింటాళ్లు కొనుగోలు చేయాలని బోథ్‌ ఆత్మ చైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ బుధవారం అదనపు కలెక్టర్‌ సంధ్యారాణికి విన్నవించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, మార్చి 24: యాసంగిలో రైతులు సాగు చేసిన శనగ పంటను ఎకరానికి తొమ్మిది క్వింటాళ్లు కొనుగోలు చేయాలని బోథ్‌ ఆత్మ చైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ బుధవారం అదనపు కలెక్టర్‌ సంధ్యారాణికి విన్నవించారు. ప్రభుత్వం ఎకరానికి 5క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. వాస్తవానికి ఈ యేడాది రబీకి అనుకూలమైన వాతావరణం ఉండడంతో 9 నుంచి 12క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందన్నారు. దీంతో మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్మాలో తెలియక ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకొని నష్ట పోవాల్సి వస్తుందని వివరించారు. ఆయన వెంట బోథ్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గుంజల భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాథోడ్‌రాయల్‌, రవియాదవ్‌, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T05:11:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising