ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంజులాపూర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ పర్యటన

ABN, First Publish Date - 2021-08-03T06:12:38+05:30

నిర్మల్‌ పట్టణం 19వ వార్డు మంజులాపూర్‌ గణ రెసిడెన్సీ ప్రాంతంలో చైర్మన్‌ ఈశ్వర్‌ సోమవారం పర్యటించారు.

గణరెసిడెన్సీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 2 : నిర్మల్‌ పట్టణం 19వ వార్డు మంజులాపూర్‌ గణ రెసిడెన్సీ ప్రాంతంలో చైర్మన్‌ ఈశ్వర్‌ సోమవారం పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లదుస్థితి, డ్రైనేజీ పరిస్థితి పరిశీలించారు. వర్షాలు పడినప్పుడు చెరువుతూము నీటిని ఏవిధంగా అరికట్టాలో అధికారులు ఆలోచించి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రవాహ ం క్రమబద్దీకరించాలని సూచించారు. నీరు ఇళ్లలో చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డామని అక్కడి ప్రజలు చైర్మన్‌కు తెలిపారు. కమిషనర్‌ బాలకృష్ణ, కౌన్సిలర్‌ లక్ష్మీసాయన్న, నాయకులు లక్ష్మణాచారి, జనార్ధన్‌, ముత్యం, రమణ, విజయ్‌, తదితరులున్నారు. 

మురికి కాలువలు శుభ్రపర్చాలి

మురికికాలువలో చెత్తాచెదారం నిండినప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రం చేయా లని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ సూచించారు. సోమవారం చైర్మన్‌ 10వ వార్డు లోని దివ్యనగర్‌లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర చెత్తాచెదారం మురికికాలువల్లో వేయకుండా చూడాలని అన్నారు.  నిర్మల్‌ పట్టణంలో మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రజల ఇబ్బందులు తొలగిస్తా మని హామీ ఇచ్చారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో పట్టణ సుందరీ కరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. కౌన్సిలర్‌ కొండ సబిత శ్రీధర్‌, పూదరి రాజేశ్వర్‌, కాలనీ అధ్యక్షుడు పి.సుదర్శన్‌రెడ్డి, కమిషనర్‌ బాల కృష్ణ, ఏఈ వినయ్‌, స్థానికులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T06:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising