ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిమిక్రీ కళాకారుడు నాగభూషణ్‌ రావు కన్నుమూత

ABN, First Publish Date - 2021-02-06T06:12:59+05:30

ప్రముఖ మిమిక్రీ కళాకారు డు దిలావర్‌పూర్‌ మండలం సాంగ్వికి చెందిన ఉప్పల నాగ భూషణ్‌రావు (44) శుక్రవా రం అనారోగ్యంతో కన్ను మూ శాడు.

అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి అల్లోల, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి అల్లోల

దిలావర్‌పూర్‌, ఫిబ్రవరి 5 : ప్రముఖ మిమిక్రీ కళాకారు డు దిలావర్‌పూర్‌ మండలం సాంగ్వికి చెందిన ఉప్పల నాగ భూషణ్‌రావు (44) శుక్రవా రం అనారోగ్యంతో కన్ను మూ శాడు. 1977లో జన్మించిన ఈయన.. తన మిమిక్రీతో ఎం దరో ప్రముఖుల మన్న నలు పొందారు. ఉమ్మడి ఆంధ్ర ప్ర దేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమ క్షంలోనే వారి ధ్వని అనుకరణ  చేసి వారిద్దరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. అయితే ఐదేళ్ల క్రితం నాగభూషణ్‌రావు కాలేయ సం బంధ వ్యాధికి గురై.. చికిత్స తీసుకున్నారు. కానీ నాలుగు నెలల క్రితం వ్యాధి మళ్లీ తిరగబడడంతో.. చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూశారు.దీంతో నాగభూషణ్‌రావు అంత్యక్రియలను స్వగ్రామ మైన దిలావర్‌పూర్‌ మండలం సాంగ్విలో శుక్రవారం సాయంత్రం గ్రామస్థులు, అభిమానుల అశ్రున యనాల మధ్య నిర్వహించారు. 


మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ పర్సన్‌ విజయ లక్ష్మీ రాంకిషన్‌ రెడ్డి నాగభూషణ్‌ రావు అంతిమ సంస్కారాలకు హాజరై నివాళులు అర్పించారు. 

పలువురి సంతాపం

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 5 : అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు యు. నాగభూషణ్‌ రావు మృతి పట్ల నిర్మల్‌ సాహిత్య కళా సంస్థ శుక్రవారం తమ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. నిర్మల్‌కు చెందిన భూషణ్‌రావు అనేక నగరాల్లో తమ ప్రదర్శనలతో రంజింపజేశాడని కొని యాడారు. రాజకీయ నా యకులు సినీనటులను తనదైన శైలిలో అనుకరించిన కళాకారుడని గుర్తు చేసుకున్నారు. ఆయన మృ తి కళారంగానికి తీరని లోటన్నారు. ఆయన కు నివాళులు అర్పించారు. తొడిశెట్టి పరమేశ్వర్‌, వెంకట్‌, హనుమంతు, శివ ప్రసాద్‌, డాక్టర్‌ కృష్ణంరాజు, సుదర్శన్‌, నాగరాజు, రఘు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T06:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising