ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

ABN, First Publish Date - 2021-06-22T04:20:41+05:30

మంచిర్యాల పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాల్‌లో ఇండియ న్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్‌మహాజన్‌ పాల్గొని రక్తదానం చేశారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య, రూరల్‌ సీఐ కుమారస్వామి, మహిళ పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, దేవయ్య, హాజీపూర్‌ ఎస్సై చంద్రశేఖర్‌, ఏఎస్సై నూనె శ్రీనివాస్‌, ఏఎస్సై వెంకన్నగౌడ్‌, మంచిర్యాల, సీసీసీ, నస్పూర్‌, హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.

రక్తదానం చేసినట్లు రెడ్‌క్రాస్‌ సొసైటీ నుండి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న ఏసీపీ అఖిల్‌మహాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జూన్‌ 21: మంచిర్యాల పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాల్‌లో ఇండియ న్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్‌మహాజన్‌ పాల్గొని రక్తదానం చేశారు. పట్టణ సీఐ ముత్తి లింగయ్య, రూరల్‌ సీఐ కుమారస్వామి, మహిళ పోలీస్‌స్టేషన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, దేవయ్య, హాజీపూర్‌ ఎస్సై చంద్రశేఖర్‌, ఏఎస్సై నూనె శ్రీనివాస్‌, ఏఎస్సై వెంకన్నగౌడ్‌, మంచిర్యాల, సీసీసీ, నస్పూర్‌, హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం  ఏసీపీ మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వలు తగ్గాయని సొసైటీ సభ్యులు తెలిపిన వెంటనే  శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి సంశయిస్తున్న తరుణంలో తలసేమియా, సికిల్‌సెల్‌, ఎనీమియా వ్యాధిగ్రస్తులకు, అత్యవసర రోగులకు రక్తం లభించడం లేద న్నారు. ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో పత్తి గట్టయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు పత్తి వెంకటేష్‌ ఆధ్వర్యంలో సభ్యులు రక్తదానం చేశారు. వారికి పట్టణ సీఐ ముత్తి లింగయ్య సర్టిఫికెట్లను అందజేశారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి, వైస్‌చైర్మన్‌ మహేందర్‌లు మాట్లాడుతూ   పోలీసుల సేవలు మరువలేనివన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో 101 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి కేంద్రానికి తరలించి భద్రపరిచినట్లు సభ్యుడు వి. మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-06-22T04:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising