ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్‌ అందించేందుకు చర్యలు

ABN, First Publish Date - 2021-10-29T04:01:30+05:30

జిల్లాలోని 18 సంవత్స రాలు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్‌ అందించేందుకు అధి కారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలె క్టర్‌ మధుసూధన్‌నాయక్‌తో కలిసి అధికారులు, మున్సిపల్‌ కమి షనర్‌లతో వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 28: జిల్లాలోని 18 సంవత్స రాలు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్‌ అందించేందుకు  అధి కారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలె క్టర్‌ మధుసూధన్‌నాయక్‌తో కలిసి అధికారులు, మున్సిపల్‌ కమి షనర్‌లతో వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లా డుతూ అర్హులైన వారందరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగు తుందని, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా వ్యాప్తిని అరికట్ట వచ్చని తెలిపారు. అధికారులకు కేటాయించిన ప్రాంతాల్లో బృం దాల ద్వారా, తెలిసిన వారిని తీసుకువెళ్లి వ్యాక్సిన్‌ అందించాలని, చౌకధరల దుకాణాల డీలర్లు ఆసరా పింఛన్‌ల జాబితా ప్రకారం ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి  వేయించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో, మైనా ర్టీ జనాభా ఉన్న చోట ఎలాంటి సమస్యలు తలెత్త కుండా  అవగాహన కల్పించి వ్యాక్సిన్‌ తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. 

హాజీపూర్‌: మండలంలోని ర్యాలీలోని గిరిజన తండాలో గురువారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఎంపీవో రవిబాబు అవగాహన కల్పించారు. అర్హులైన వారందరు టీకా వేయించుకోవాలని సూచించారు. కొలాంగూడ గిరిజన ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి టీకాలను వేయించారు. కొలాంగూడలో వంద శాతం టీకా పూర్తయింది. గ్రామ ప్రత్యేకాధికారి ఫాతి మా, కార్యదర్శి గణేష్‌కుమార్‌, ఏఎన్‌ఎం ఆదిలక్ష్మీ, ఆశా కార్యకర్త రేష్మ తదితరులు పాల్గొన్నారు. 

భీమారం: మద్దికల్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని జానపద కళాకారులు ప్రజలకు అవగాహన కల్పించారు. పరిస రాల పరిశుభ్రతను వివరించారు. సర్పంచు వాణిబల రాంరెడ్డి, కార్యదర్శి కైలాస్‌రాథోడ్‌ పాల్గొన్నారు. పలు గ్రామాల్లో నిర్వహిస్తు న్న కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతిబాపురావులు పరిశీలించారు. 

 

Updated Date - 2021-10-29T04:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising