ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manuguru ఏరియాలో సమ్మె విజయవంతం

ABN, First Publish Date - 2021-12-10T18:40:24+05:30

కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం సింగరేణి బ్లాకులను వేలంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పటాన్ని నిరసిస్తూ ఐఖ్య కార్మిక సంఘాల ఆద్వర్యంలో చేపట్టిన సమ్మె తొలిరోజు విజయ వంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కేవలం 14 శాతం కార్మికుల హాజరు

- పూర్తిస్థాయిలో నిలిచిన ఉత్పత్తి

- నిల్వ బొగ్గును రవాణా చేసిన సింగరేణి


మణుగూరుటౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం సింగరేణి బ్లాకులను వేలంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పటాన్ని నిరసిస్తూ ఐఖ్య కార్మిక సంఘాల ఆద్వర్యంలో చేపట్టిన సమ్మె తొలిరోజు విజయ వంతమైంది. మణుగూరు ఏరియాలోని గనులు, వివిధ విబాగాల కార్మికులు పెద్దఎత్తున తమ విధులకు గౌర్హాజరై సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఏరియా గురువారం తొలి, రెండవ షిఫ్ట్‌లలో పూర్తి స్థాయిలో బొగ్గు ఉత్పత్తికి ఆటం కం ఏర్పడింది. బుధవారం రాత్రి మూడో షిఫ్ట్‌(రాతి)నకు హాజరైన కార్మికులు, ఆపరేటర్లు బొగ్గుతో లోడైన తమ వాహనాలను ఎక్కడిక్కడ నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. 


రెండు షిఫ్ట్‌లలో 317 మంది ఉద్యోగుల హాజరు

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన 72 గంటల సమ్మెలో భాగంగా తొలిరోజు రెండు షిఫ్ట్‌లలో కలపి కేవలం 14 శాతం మంది కార్మికులు మాత్రమే హాజరయ్యారు. తొలి షిఫ్ట్‌లో ఏరియాలో 1,809 మంది కార్మికులకు గానూ కేవలం 243 మంది కార్మికులు, రెండో షిఫ్ట్‌లో 389 మంది కార్మికులకు గాను 74 మంది కార్మికులు మాత్రమే విధులకు హాజరయ్యారు. దాదాపు మూడో షిఫ్ట్‌లోనూ ఇదే ప్రభావం ఉంటుందని ఐఖ్య కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సింగరేణి సమ్మె నేపథ్యంలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా మణుగూరు పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది కార్మికుల అడ్డాలు, ప్రధాన చెక్‌పోస్ట్‌ వద్ద బందోబస్తు నిర్వహించారు.


నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఐఖ్య కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏరియాలో దాదాపు కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకమేర్పడింది. దాదాపు తొలిరోజు సమ్మె ప్రభావంతో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో నిలువ ఉన్న బొగ్గును రైల్వే మార్గంలో రెండు రేక్‌లు, బీటీపీఎస్‌కు సుమారు రెండువేల టన్నులు, రోప్‌వే ద్వారా హెచ్‌డబ్ల్యూపీఎం ప్లాంట్‌కు కొంత మొత్తంగా బొగ్గు రవాణా చేశారు. దాదాపు గురువారం ఏరియా నుంచి 4,300 టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు సమాచారం. 


సమ్మె విజయవంతం: కార్మిక సంఘాల నాయకులు

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె విజయవంతమైందని కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం జేఏసీ నాయకులు పీకేవోసీ గని ప్రధాన చెక్‌పోస్ట్‌, కార్మికుల అడ్డాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. సంస్థను కాపాడుకో వాలంటే సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరారు. కార్యక్రమంలో ప్రభాకర్‌రావు, రాంగోపాల్‌, శ్రీనివాసరావు, నాసర్‌పాషా, రవీందర్‌రావు, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-12-10T18:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising