ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండా మల్లేష్‌ సేవలు మరువలేనివి

ABN, First Publish Date - 2021-10-21T04:23:22+05:30

దివంగత మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ సేవలు మరువలేనివని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌, నిర్మల్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. విలాస్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌,
మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 20: దివంగత మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ సేవలు మరువలేనివని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌, నిర్మల్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. విలాస్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా , సీపీఐ శాసనసభాపక్షనేతగా పనిచేసి ప్రజా గొంతుకగా పోరాటాలు చేసిన మహానీయుడు గుండా మల్లేష్‌ అన్నారు. భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని సమరశీల పోరాటాలు చేసిన కమ్యూనిస్టు ఉద్దండుడు గుండా మల్లేష్‌ అని  కొనియాడారు.  మంచిర్యాలలో 24న నిర్వహించ తలపెట్టిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  కోరారు. కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడి హాజరు కానున్నారని తెలిపారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కలీందర్‌ఆలీఖాన్‌, రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, జోగుల మల్లయ్య, మిట్టపల్లి పౌలు, పోచన్న, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్‌, రాజేశం, శంకరయ్య, లక్ష్మణ్‌, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising