ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూలే అడుగుజాడల్లో నడుద్దాం : మంత్రి

ABN, First Publish Date - 2021-04-12T06:02:53+05:30

మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జ్యోతి బా పూలే 195వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

ఖానాపూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

నిర్మల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జ్యోతి బా  పూలే 195వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే మహిళల అక్షరాస్యత కోసం విశేష కృషి చేశారన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌ కల్చరల్‌: పట్టణంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో బీసీ సంఘాల నాయకులు, టీఎంజీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌: సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో దేశానికి మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే రేఖానాయక్‌ కొనియాడారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాతబస్టాండ్‌లో అంబెద్కర్‌ సంఘం ఆద్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

కడెం: మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీసీపీ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే నచ్చన్‌ ఎల్లాపూర్‌లో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

భైంసా: పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పూలే  జయంతిని ఘనంగా నిర్వహించారు. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ముథోల్‌: మండల కేంద్రంలో పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కుభీర్‌: మండలకేంద్రంలో ఎన్‌వైకేఎస్‌ ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో అంబేద్కర్‌ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

నర్సాపూర్‌(జి): మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఇందులో అంబేద్కర్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.

లోకేశ్వరం: మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో అధికారులు, నాయకులున్నారు.

భైంసా రూరల్‌: మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో దళిత, బహుజన సంఘాల నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-12T06:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising