ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేయాలి

ABN, First Publish Date - 2021-06-15T04:54:10+05:30

జిల్లాలో పరిశ్రమల స్థాప నకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 14: జిల్లాలో పరిశ్రమల స్థాప నకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసర మైన వసతులు కల్పించేలా అధికారులు కృషి చేయా లన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే జిల్లా అభివృద్ధి పురోగ మిస్తుందన్నారు. పరిశ్రమలశాఖ ద్వారా ఇచ్చే ప్రోత్సా హకాలను ఔత్సాహికులకు తెలియజేయాలని తెలి పారు. ఇప్పటివరకు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దఖాస్తులకు సంబంధించి సమాచారం అడిగి తెలు సుకుని వాటి పరిష్కారినికి అవసరమైన సూచనలు, సలహాలు సంబంధిత అధికారులకు తెలియజేశారు. టీఫ్రైడ్‌ పథకంకింద ఇప్పటివరకు 8మంది ఎస్సీలకు, ఆరుగురు ఎస్టీలకు రూ.36లక్షలరాయితీకి సంబంధిం చినమొత్తాన్ని మంజూరుచేసినట్లు తెలిపారు. అలాగే పావలావడ్డీ చొప్పున ఇద్దరికి 47వేలరూపాయలు మంజూరు చేశామన్నారు. తిర్యాణి మండలంలో ఏర్పాటుచేస్తున్న ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌పై ప్రత్యేక దృష్టి కేటాయించాలని తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ విజయవంతానికి అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. డీఐసీ రఘు, ఐపీవో అశోక్‌, జిల్లా ఇన్‌చార్జి రవాణా శాఖాధికారి కృష్ణయ్య, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రామయ్య పాల్గొన్నారు.

- ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించడం అభినందనీయం..

జిల్లాకు ఆక్సన్‌ ఎయిడ్‌ సంస్థ వారు రూ.22లక్షల విలువ చేసే 40ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించడం అభినందనీయమని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆసిఫాబాద్‌ ఎమ్మెలే ఆత్రం సక్కు జిల్లాకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు రావడానికి కృషిచేసిన మర్సుకోల తిరుపతితో కలిసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్రానికి ఒకటి చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న ఆక్సిజన్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ కాన్సంట్రేటర్లు రోగులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-06-15T04:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising