ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాన్ని సేకరించాలి

ABN, First Publish Date - 2021-06-24T07:05:53+05:30

జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను గుర్తించి రేపటిలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తహసీల్దార్లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌, జూన్‌23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను గుర్తించి రేపటిలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పల్లె ప్రకృతి వనాలకు భూముల గుర్తింపు, శ్మశాన వాటికల నిర్మాణాలు, ఈఎపిక్‌కార్డుల డౌన్‌లోడ్‌ తదితర అంశాలపై సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మండలంలో పది ఎకరాల భూమిలో భృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని అందుకు తగిన భూమిని గుర్తించి నివేదికలు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్‌తో సీఎం కేసీఆర్‌ త్వరలోనే సమీక్షించనున్నారని తెలిపారు. అందు కు తగిన భూములను తహసీల్దార్లు, ఎంపీడీవోలు సంయుక్తంగా భూములను పరిశీలించాలన్నారు. శ్మశాన వాటికల నిర్మాణాలను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ ఎపిక్‌ కార్డులను రేపటిలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీఏ పీడీ కిషన్‌, డీపీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T07:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising