ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మణచాంద ఎంపీపీ రాజీనామా

ABN, First Publish Date - 2021-10-21T06:34:24+05:30

లక్ష్మణచాంద ఎంపీపీ పదవికి బుధవారం రాజీనామ చేసినట్లు కేశంలక్ష్మి తెలిపారు.

జడ్పీ సీఈవోకు రాజీనామా అందజేస్తున్న ఎంపీపీ కేశం లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్ష్మణచాంద, అక్టోబరు 20 : లక్ష్మణచాంద ఎంపీపీ పదవికి బుధవారం రాజీనామ చేసినట్లు  కేశంలక్ష్మి తెలిపారు. ఈ మేరకు అందుకు సంబంధిం చిన తన రాజీనామా లేఖను జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) సుధీర్‌కుమార్‌కు  అందజేశామన్నారు. 2019 జూలై 4న ఎంపీపీగా ప్రమాణస్వీకారం చేసిన ఆమె బుధవారం నాటికి 2 సంవత్సరాల 3 నెలల 16 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనకు సహకరించిన రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అట వీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారమే పార్టీపెద్దలు మంత్రివర్యులపై గౌర వంతో తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజీనామా చేసిన సమయంలో ఆమె వెంట టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి నాయకులు అల్లోల సురేందర్‌ రెడ్డి, డీసీసీబీ జిల్లా చైర్మన్‌ ఎర్ర రఘునందన్‌ రెడ్డి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ కొరిపెల్లి క్రిష్టారెడ్డి, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌ కేశం శ్రీనివాస్‌ ఉన్నారు. 


Updated Date - 2021-10-21T06:34:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising