ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు జిల్లాలో రెండు ఆస్పత్రుల ఎంపిక

ABN, First Publish Date - 2021-01-13T04:53:48+05:30

కొవిడ్‌ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలో భాగంగా ఈనెల 16న టీకా ఇచ్చేందుకు రెండు ఆస్పత్రులను ఎంపిక చేశారు.

మెడిలైఫ్‌ ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలో భాగంగా ఈనెల 16న టీకా ఇచ్చేందుకు రెండు ఆస్పత్రులను ఎంపిక చేశారు. జిల్లాలో మొదటి దఫా టీకా ఇచ్చేందుకు రెండు ఆస్పత్రులను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాసుపత్రితో పాటు మెడిలైఫ్‌, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులలో టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులలో కేవలం మెడిలైఫ్‌నే ఎంపిక చేయడం గమనార్హం. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మెడిలైఫ్‌ ఆస్పత్రికి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కాగా మొదటి రోజు రెండు ఆస్పత్రుల పరిధిలో 60 మంది వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం రెండు ఆస్పత్రులలో 30 మంది చొప్పున సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి పంపించారు. 16న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు టీకా పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. 


Updated Date - 2021-01-13T04:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising