ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంది పురస్కార గ్రహీతలకు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2021-03-01T04:22:01+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజమహేంద్ర వరంలో జాతీయ నంది పురస్కరాలను అందుకొని ఆదివారం ఆసిఫాబాద్‌ పట్టణానికి చేరుకున్న కవులు గుర్రాల వెంకటేశ్వర్లు, వనపర్తి తిరుపత, ధర్మపురి వెంకటేశ్వర్లను స్థానిక సాహితీ అభిమానులు, ఆసిఫాబాద్‌ కవుల సంఘం, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

నంది పురస్కారాలు అందుకున్న కవులకు సన్మానం చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజమహేంద్ర వరంలో జాతీయ నంది పురస్కరాలను అందుకొని ఆదివారం ఆసిఫాబాద్‌ పట్టణానికి చేరుకున్న కవులు గుర్రాల వెంకటేశ్వర్లు, వనపర్తి తిరుపత, ధర్మపురి వెంకటేశ్వర్లను స్థానిక సాహితీ అభిమానులు, ఆసిఫాబాద్‌ కవుల సంఘం, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. స్థానిక చెక్‌ పోస్టు నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి ఇంటి వరకు ప్రదర్శనగా తీసుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి ఆధ్వర్యంలో కవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ గోదావరి నంది పురస్కారాలతో ఈ కవులు కుమరం భీం ఆసిఫాబాద్‌ ఖ్యాతిని మరింత పెంచారన్నారు. జిల్లాకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం గర్వకారణమన్నారు. ఆసిఫాబాద్‌ సాహిత్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటానని అ న్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడి కవులకు గుర్తింపు వచ్చేలా శ్రద్ధ తీసుకుంటానని కోవ లక్ష్మి తెలిపారు. కార్య క్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌, సింగిల్‌ విండోచైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిలువేరు వెం కన్న, మాజీ ఎంఈవో శంకర్‌, ఆసిఫాబాద్‌ కవుల సంఘం నాయకులు రమేశ్‌, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, కవులు మధుకర్‌ శర్మ, వెంకట్రావ్‌, పూర్ణచందర్‌రావు, సత్యనారాయణ, జ్యోతి, సుధాకర్‌, రవి, శంకర్‌, విజయ్‌కుమార్‌, సత్యనారాయణ, రాజన్న, పెంటన్న, శ్రావ్య, నజీర్‌, ముషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising