ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక అందరికీ కరోనా టీకా

ABN, First Publish Date - 2021-02-27T04:08:36+05:30

క అందరికీ కరోనా టీకా అందనుంది.

లోగో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మార్చి 1 నుంచి 60 ఏళ్లకు పైబడిన వారందరికీ..
-45 ఏళ్లకు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు వ్యాక్సినేషన్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 26: ఇక అందరికీ కరోనా టీకా అందనుంది. మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న రెండోవిడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలకు టీకా వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటిదాకా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్లు అందగా.. ఇక నుంచి 60 ఏళ్లకు పైబడినవారు, 45 ఏళ్లకు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధుల (బీపీ, షుగర్‌) బాధపడే వారికి ప్రాధాన్య ప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ చేయనున్నారు.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు..
ఇప్పటిదాకా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అం దించారు. ఈ ప్రక్రియ జిల్లాలో ఇంకా కొనసాగుతోంది. మొ దటగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేపట్టగా ఫ్రంట్‌లైన్‌ వారి యర్స్‌ కింద పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేశారు. మొదటి దఫాలో టీకా తీసుకున్న వీరికి రెండో దఫా టీకా కూడా వేస్తున్నారు. జిల్లాలో 4,012 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 2,567 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. 3,111 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా వేయ డం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,036 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. అనివార్య కారణాల వల్ల టీకా వేయించుకోని వారికి శుక్ర వారం నుంచి వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

వృద్ధులతో పాటు..
తాజాగా ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు 45 సంవ త్సరాలు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో వీటికి సంబంధించిన మార్గద ర్శకాలు వెలువడనున్నాయి. అయితే 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రిజిస్ట్రేషన్‌ పద్ధతి ద్వారా టీకా వేసేందుకు ఏర్పాట్లు చేయనున్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ‘కొవిన్‌’ సాఫ్ట్‌వేర్‌లో వారి వివరాలను అప్‌లోడ్‌ చేసి టీకా వేయనున్నట్లు తెలు స్తోంది. జిల్లాలో బీపీ, షుగర్‌, హైపర్‌టెన్షన్‌, టీబీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించారు. జిల్లాలో 4707 మంది షుగర్‌, 16,404 మంది హైపర్‌ టెన్షన్‌ వ్యాధిగ్రస్థులు ఉన్నారు. అదే విధంగా 35 మంది డయాలసిస్‌, 11 మంది తలసేమియా వ్యాధిగ్రస్థు లు ఉన్నారు. ఇతరాత్ర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి టీకావేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Updated Date - 2021-02-27T04:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising