ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవికి కపిల్‌సింధే రాజీనామా

ABN, First Publish Date - 2021-02-28T06:32:11+05:30

పార్టీ అంతర్గత కలహాలతో భైంసా మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవికి కపిల్‌సింధే శనివారం రాజీనామా చేశారు.

రాజీనామా లేఖ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భైంసా, ఫిబ్రవరి 27 : పార్టీ అంతర్గత కలహాలతో భైంసా మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవికి కపిల్‌సింధే శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు సంబంధిత రాజీ నామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కి పంపించారు. ఈ సందర్భంగా కపిల్‌ సింధే మాట్లాడుతు.. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు 2020లో జరిగిన మున్సి పల్‌ ఎన్నికల అనంతరం 11వ వార్డు సభ్యునిగా గెలుపోందిన తాను మున్సిపల్‌ కౌన్సిల్‌ లో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పి.రమాదేవీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పట్టణ పార్టీ అధ్యక్షులు బాలాజీ సూత్రావే అవలంభిస్తున్న స్వార్థపూరిత విధానాలను నిరసిస్తూ తాను ఫ్లోర్‌ లీడర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కోన్నారు. వీరిద్దరి తీరుతో పార్టీకి చెందిన కౌన్సిలర్లు అప్రతిష్ఠ పాలవుతుండడంతో పార్టీ పటిష్ఠతకు భంగం వాటిల్లుతుందన్నారు. వీరి వైఖరి మూలంగా ఫ్లోర్‌లీడర్‌ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న కారణంగానే రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ పదవికి తాను సమర్పించిన రాజీనామాను అంగీ కరించాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2021-02-28T06:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising