కాగజ్‌నగర్ సీఐ తీరు సరికాదు
ABN, First Publish Date - 2021-09-13T04:01:28+05:30
పట్టణానికి చెందిన సీఐ మోహన్ తీరు సరికాదని ఆర్మీ రిటైర్డ్ జవాన్ల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ తీరుపై ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్మీ రిటైర్డ్ జవాన్ల సంఘం సభ్యులు తెలిపారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం
ఆర్మీ రిటైర్డ్ జవాన్ల సంఘం సభ్యులు
కాగజ్‌నగర్, సెప్టెంబరు 12: పట్టణానికి చెందిన సీఐ మోహన్ తీరు సరికాదని ఆర్మీ రిటైర్డ్ జవాన్ల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ తీరుపై ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్మీ రిటైర్డ్ జవాన్ల సంఘం సభ్యులు తెలిపారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తమ సంఘానికి చెందిన రిటైర్డ్ ఆర్మీజవాను శివకు మార్ భూవివాదంలో న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడే ఉన్న సీఐ మోహన్ ఒక్కసారిగా దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఈ విషయంలో తాను రిటైర్డ్ ఆర్మీ జవాను అని చెప్పినప్పటికీ కూడా నీతోని ఏమై తదిరా అంటూ బూతులు తిడుతూ మళ్లీ లోపలికి తీసుకెళ్లి కొట్టినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం జరుగకపోతే ఊరుకునేది లేదన్నారు. తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతామన్నారు. దేశా నికి సేవచేసి వచ్చిన సైనికుడిని ఇష్టా నుసారంగా కొట్టిన సీఐపైచర్యలు తీసుకో వాలని సీపీకి కూడా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మీ జవా నుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-13T04:01:28+05:30 IST