ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత మహిళలకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2021-02-26T03:39:57+05:30

సఖి కేంద్రం సేవలను మరింత విస్తృత పరిచి బాధిత మహిళలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుంర ఈశ్వరీబాయి అన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న ఈశ్వరీబాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి25: సఖి కేంద్రం సేవలను మరింత విస్తృత పరిచి బాధిత మహిళలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుంర ఈశ్వరీబాయి అన్నారు. మహిళా కమిషన్‌ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలో మొదటి సారి పర్యటించిన ఆమె జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం ద్వారా బాధితులకు అందిస్తున్న సేవల గురించి నిర్వాహకురాలు సౌజన్య ఆమెకు వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పోస్టుమెట్రిక్‌ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాలను పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను జీసీడీవో శకుంతల   సన్మానించారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలి శారు. ఈ కార్యక్రమంలో సఖి నిర్వాహకులు సౌజన్య, కౌన్సిలర్లు సుమలత, మమత, శ్రీనిధి, మౌనిక, లీగల్‌ అడ్వైజర్‌ రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T03:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising