ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం కోసం కమిషనరేట్‌ ముట్టడి

ABN, First Publish Date - 2021-01-19T06:40:12+05:30

తమకు రావాల్సిన పంట నష్ట పరిహారం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జిల్లాలోని రైతులు సోమ వారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడిం చారు.

ఉరి తాళ్లతో రైతుల వినూత్న నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి18: తమకు రావాల్సిన పంట నష్ట పరిహారం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ జిల్లాలోని రైతులు సోమ వారం హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడిం చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతులు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాయల శంకర్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న రైతులకు పంట నష్ట పరిహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా తనవాటా చెల్లించక పోవడంతో రైతులు కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని పొందలేక పోయారన్నారు. రైతుల గోస ఆలకించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే తనవాటా నిధులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫసల్‌బీమా యోజన పథకంలో 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రైతులు ప్రీమియం డబ్బులు చెల్లించి రెండేళ్లు గడుస్తున్నారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పలుమార్లు కలెక్టర్‌ కార్యాలయం ముట్టడించిన అధికారులు సైతం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులకు రావాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం తనవాటాగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కిసాన్‌మోర్చ అధ్యక్షుడు దయాకర్‌, ఆయా గ్రామాల రైతులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T06:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising