ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల తనిఖీ

ABN, First Publish Date - 2021-03-03T02:45:03+05:30

మండలంలోని మద్దికల్‌, ఎల్కేశ్వరం గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ్ల కలెక్టర్‌ భారతి హోళికేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎల్కేశ్వరంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమారం, మార్చి 2: మండలంలోని మద్దికల్‌, ఎల్కేశ్వరం గ్రామాల్లో  చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ్ల కలెక్టర్‌ భారతి హోళికేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలను కలెక్టర్‌ పరిశీలించారు. గ్రామాల్లో డంపింగ్‌యార్డు పనులు పూర్తికాగా రంగులు ఎందుకు వేయలేదని కార్యదర్శులు, సర్పంచులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికల పనులు ఇంకా కొనసాగుతుండడంతో కార్యదర్శులు పనులపై నిర్లక్ష్యం వహించినందుకే ముందుకు సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాబోయే పది రోజుల్లో పనులను పూర్తి చేయాలన్నారు. మద్దికల్‌లోని పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పూలు, పండ్ల మొక్కలు ప్రకృతి వనంలో ఉండడం తో అటవీ సంబంధమైన మొక్కలను ఎందుకు నాటలేదని అధికారులను ప్రశ్నించారు. ఎల్కేశ్వరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో మొక్కలు లేకుండా  మట్టితో నింపిన బ్యాగులను చూసి  వెంటనే మొక్కలను నాటాలని కార్యదర్శికి సూచించారు. ఎండాకాలం వస్తున్నందున చలువ పందిళ్లను నర్సరీల్లో ఏర్పాటు చేయాలని,  రాబోయే హరితహారం నాటికి మొక్కలను సిద్ధం చేయాలన్నారు.  పనులను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించాలని, ఉపాధిహామీ పనులను సక్రమంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో శ్రీపతిబాపురావు, ఏపీవో శ్రీనివాస్‌, సర్పంచు ఒడేటి వాణి, కార్యదర్శులు కైలాష్‌, శ్రావ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T02:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising