అక్రమ కట్టడం కూల్చివేత
ABN, First Publish Date - 2021-10-30T03:47:10+05:30
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 72 సుందరయ్య కాలనీ వారసంత ఇంటిగ్రేటె డ్ మార్కెట్‌కు కేటాయించిన భూమిలో అక్రమంగా నిర్మిం చిన గోడను శుక్రవారం అధికారులు కూల్చివేశారు. ఇంటి గ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి అవ సరం కాగా ఎకరం ముప్పై గుంటల భూమి ఉన్నది. దీంతో అధికారులు సర్వే చేసి కబ్జాకు గురైన భూమిని గుర్తించి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు.
ఆగ్రహంతో ఎక్స్‌కావేటర్ పైకి రాళ్ళు, పగిలిన అద్దాలు
నలుగురిపై కేసు
నస్పూర్, అక్టోబర్ 29: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 72 సుందరయ్య కాలనీ వారసంత ఇంటిగ్రేటె డ్ మార్కెట్‌కు కేటాయించిన భూమిలో అక్రమంగా నిర్మిం చిన గోడను శుక్రవారం అధికారులు కూల్చివేశారు. ఇంటి గ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రెండు ఎకరాల భూమి అవ సరం కాగా ఎకరం ముప్పై గుంటల భూమి ఉన్నది. దీంతో అధికారులు సర్వే చేసి కబ్జాకు గురైన భూమిని గుర్తించి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. 18 గుంటల భూమిని రెవెన్యూశాఖ మున్సిపల్‌కు ఈనెల 7న అప్పగించింది. ఈ భూమిలో మున్సిపల్ అధికారులు సిమెంట్ పోల్స్ వేసి ఫెన్సింగ్ వేశారు. ఈ భూమి తమకు చెందినదని కొందరు రాత్రికిరాత్రే ఫెన్సింగ్‌ను తొలగించి గోడ నిర్మించారు. సాయంత్రం మరోవైపు మొద లుపెట్టే ప్రయత్నం చేయడంతో తహసీ ల్దార్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ రాయ లింగు, టౌన్‌ప్లానింగ్ అధికారి యశ్వంత్ కుమార్, సీఐ సంజీవ్, ఎస్సై శ్రీనివాస్‌లు చేరుకుని పనులు నిలిపివేయాలని ఆదే శించారు. మీ వద్ద ఆధారాలు ఉంటే న్యాయపరంగా వెళ్ళాలని, ఫెన్సింగ్ తొల గించి దౌర్జన్యంగా గోడ పెట్టడం పద్ధతి కాదన్నారు. గోడను కూల్చి వేసేందుకు వచ్చిన ఎక్స్‌కావేట ర్‌ను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ భూమి సర్వే నంబరు 76కు చెందినదని అధికారులతో వాదించారు. గోడను కూల్చివేస్తుండగా ఒకరు ఎక్స్‌కావేట ర్‌పైకి రాయి విసరడంతో అద్దాలు పలిగాయి.
అధికారులపై దురుసుగా ప్రవర్తించి వాహనంపై రాళ్ళు విసిరినందుకు కమి షనర్ రాయలింగు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. మహ్మ ద్ మౌలానా, మహ్మద్ సమీర్, మహ్మద్ అబ్దుల్, మహ్మద్ అలీం పాషాలపై కేసు నమోదు చేశామని ఎస్సై టి. శ్రీనివాస్ తెలిపారు.
Updated Date - 2021-10-30T03:47:10+05:30 IST