ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యావలంటీర్లను నియమించండి

ABN, First Publish Date - 2021-12-09T04:23:05+05:30

వేమనపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానాల్లో ప్రస్తుతం విద్యావలంటీర్లను నియమించాలని వారికి సొంత డబ్బులతో వేతనాలు ఇస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు.

విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
వేమనపల్లి, డిసెంబరు 7: వేమనపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానాల్లో ప్రస్తుతం విద్యావలంటీర్లను నియమించాలని వారికి సొంత డబ్బులతో వేతనాలు ఇస్తానని  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. వేమనపల్లిలో  టీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు నిర్మించిన నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి బుధవారం  హాజరైన ఎమ్మెల్యే అనంతరం ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే అక్కడ పదో తరగతి చదివే విద్యార్థుల తరగతి గదికి వెళ్లి కొద్దిసేపు పాఠాలను బోధించారు. అనంతరం విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకాదని, గ్రామీణ ప్రాం త విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.  ఎంఈవో తిరుపతిరెడ్డి పాఠశాలలో పలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా బోధించేందుకు విద్యావలంటీర్లను నియమిం చాలని ఆదేశించారు. ఇందుకు తాను ప్రతి నెలా కొంత ఆర్థిక సహా యం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచు కుబి డె మధుకర్‌, రైతు సమన్యయ సమితి కన్వీనర్‌ భీమన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆకుల లింగగౌడ్‌, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-12-09T04:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising