ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గొర్రె కాపరుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి’

ABN, First Publish Date - 2021-03-02T05:52:45+05:30

గొర్రె కాపరుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి అన్నారు.

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌టౌన్‌, మార్చి 1 : గొర్రె కాపరుల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. రాష్ట్ర వోబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఏ.భాస్కర్‌ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వోబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకంలో భాగంగా గొర్రె కాపరులకు ఆర్థిక చేయూతనివ్వడానికి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క గొర్రె కాపరి నుండి 31,250 రూపాయలు సేకరిం చింది. ఇక చాలా మందికి మూడు సంవత్సరాలైనా కూడా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ జరగలేదు. మళ్ళీ రెండో విడత పంపిణీ అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ మొదటి విడత డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలు మంజూరు చేస్తూ రెండో విడత వారికి నేరుగా వారి అకౌంట్‌లో నగదు బదిలీ చేసి, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి తదితరులున్నారు.


Updated Date - 2021-03-02T05:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising