ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా హనుమాన్‌ జయంతి

ABN, First Publish Date - 2021-04-28T05:07:19+05:30

మండలంలోని కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో మంగళవారం హనుమాన్‌ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు

బెజ్జూరులో పూజలు నిర్వహిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 27: మండలంలోని కేస్లాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో మంగళవారం హనుమాన్‌ జయంతి వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, బాలేష్‌గౌడ్‌, జీవన్‌, శైలు, కార్తీక్‌, మోహన్‌, రవీందర్‌, గణేష్‌, మంగ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: మండలంలోని ఎల్కపల్లి, చిన్నసిద్దాపూర్‌, బెజ్జూరు గ్రామాల్లో హనుమాన్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. మం డలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో హనుమాన్‌ జెండాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కొవిడ్‌ నేపథ్యంలో అతి తక్కువ మందినే అనుమతించారు.
దహెగాం: మండలంలోని చిన్నరాస్పెల్లిలో, పాత దహెగాంలలోని హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత దహెగాం హనుమాన్‌ ఆలయంలో అన్నదానం చేపట్టారు.
లింగాపూర్‌: మండల కేంద్రంతో పాటు జాముల్‌ధర, మారుగూడ, నాగుగూడ, నాయక్‌ఫోడ్‌గూడ, కనేపల్లి, గోపాల్‌పూర్‌, మామిడిపల్లి, కోత్తపల్లి, కంచన్‌పల్లి, ఘూంనూర్‌, రావునుర్‌, తదితర గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారమే వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2021-04-28T05:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising