ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో వడగండ్ల వాన

ABN, First Publish Date - 2021-05-03T05:04:50+05:30

జిల్లాలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల మామిడి నేలరాలింది. చేతికచ్చిన పంట ధ్వంసమైంది.

తాంసి మండలంలో నేలకొరిగిన జొన్న పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాకెరలో పిడుగుపాటుకు 25 మేకలు మృతి 

బోథ్‌ రూరల్‌, మే 2: జిల్లాలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల మామిడి నేలరాలింది. చేతికచ్చిన పంట ధ్వంసమైంది. తాంసి మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో యాసంగి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నువ్వుల పంట పూర్తిగా నేల పాలైంది. మరో రెండు మూడు రోజుల్లో కోతకు వచ్చే పంటలు నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బోథ్‌ మండలం సాకెర గ్రామానికి చెందిన 25 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. ఆదివారం సాకేర గ్రామానికి చెందిన పలువురి మేకలను బుర్కే గోవింద్‌ అనే మేకల కాపరి గ్రామ సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో మేకలన్నీ సమీపంలోని చెట్టు కిందికి వెళ్లగా ఇదే సమయంలో ఒక్కసారిగా మేకలపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. మేకల కాపరి సురక్షితంగా ఉన్నాడు.

Updated Date - 2021-05-03T05:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising