ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్కా, గంజాయి విక్రయిస్తే కఠినచర్యలు

ABN, First Publish Date - 2021-10-24T04:29:33+05:30

పాన్‌షాప్‌లలో గుట్కా, గంజాయి విక్ర యిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ(అడ్మిన్‌) వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని పలు పాన్‌షాప్‌లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధిత గుట్కావిక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

కాగజ్‌నగర్‌లో పాన్‌ షాపులను తనిఖీ చేసి వస్తున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ(అడ్మిన్‌) వైవీఎస్‌ సుదీంద్ర

ఆసిఫాబాద్‌ రూరల్‌, అక్టోబరు 23: పాన్‌షాప్‌లలో గుట్కా, గంజాయి విక్ర యిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ(అడ్మిన్‌) వైవీఎస్‌ సుదీంద్ర అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని పలు పాన్‌షాప్‌లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధిత గుట్కావిక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రైతులు తమ పంటపొలాల్లో గంజాయి సాగు చేయవద్దన్నారు. గంజాయి సాగుచేస్తే రైతుబీమా, రైతుబంధును ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ అశోక్‌ ఉన్నారు.

కాగజ్‌నగర్‌లో..

కాగజ్‌నగర్‌ టౌన్‌: శనివారం రాత్రి కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు కూడళ్లలోని పాన్‌టేలాలను ఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు అమ్మకాలు జరిపితే ఊరుకునేది లేదన్నారు. ఎంతటి వారిపైనయినా కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయనవెంట డీఎస్పీ కరుణాకర్‌, పట్టణ ఇన్‌చార్జీ సీఐ రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.

మండలాల్లో తనిఖీలు..

కౌటాల/దహెగాం/బెజ్జూరు/ సిర్పూర్‌(టి): కౌటాల, దహెగాం, బెజ్జూరు, సిర్పూర్‌(టి) మండల కేంద్రా ల్లోని పలుదుకాణాలు, పాన్‌టేలాల్లో శనివారం పోలీ సులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిషేధితగుట్కా, ఖైనీఅమ్మకాలు చేయవ ద్దని,గంజాయిరహిత ప్రాంతంగామార్చేందు అందరూ సహకరించాలన్నారు. ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో కౌటాల ఎస్సై ఆంజనేయులు, దహెగాం ఎస్సై రఘుపతి, బెజ్జూరు ఎస్సై సాగర్‌, సిర్పూర్‌(టి) ఎస్సై బుద్ధే స్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising