ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-05-21T04:32:10+05:30

నెలాఖరులోగా జిల్లాకు కేటాయించిన ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెన్నూర్‌ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ భారతి హొళికేరి, అద నపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే శుద్ధి చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, కేంద్రాల వారు ధాన్యాన్ని నిర్దేశించిన విధంగా రైస్‌మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 20 : నెలాఖరులోగా జిల్లాకు కేటాయించిన ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెన్నూర్‌ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ భారతి హొళికేరి, అద నపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని  కల్లాల్లోనే శుద్ధి చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, కేంద్రాల వారు ధాన్యాన్ని నిర్దేశించిన విధంగా రైస్‌మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. వర్షాకాలం రాకముందే కొనుగోలు చేయాలని, జిల్లాకు కేటాయించిన లక్షా 10 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 91 కొనుగోలు కేంద్రాల్లో  74 వేల మెట్రిక్‌టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని, 65 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తరలించామని, చెన్నూర్‌ నియోజకవర్గ పరిధిలో 31 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో 3700 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించడం జరిగిందని, మిగిలిన ధాన్యాన్ని గడువులోపు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  కలెక్టర్‌ భారతి హొళికేరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రణాళికబద్దంగా జరిగేవిధంగా  అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, గన్నీ సంచులు, టార్పాలిన్‌లు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోలు కేంద్రాలు నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసి రైస్‌మిల్లులకు అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలని ఆదేశించారు. అంచనాలు మించి వచ్చిన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని, కరోనా వ్యాప్తి ఉన్నందున నిర్వాహకులు, రైతులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు. డీఆర్‌డీఓ శేషాద్రి, జిల్లా అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ వీరయ్య, డీటీఓ, కిష్టయ్య,  డీసీ ఎంఎస్‌ అధికారులు, సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌ గెడెం గోపాల్‌, రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నల్మాసు కాంతయ్య, మిల్లర్లు, లారీ యజమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T04:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising