ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ సంస్క ృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-10-29T05:59:26+05:30

ఏడేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉట్నూర్‌, అక్టోబరు 28: ఏడేళ్ల కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. గురువారం స్థానిక కుమరం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పోరుగడ్డ జోడేఘాట్‌లో కుమరం భీం మ్యూజియం, జంగుబాయి ఉత్సవాలు, నాగోబా ఆలయాభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు దీపావళి దండారీ ఉత్సవాలకు కోటి రూపాయలు మంజూరు చేస్తూ వస్తున్నారన్నారు. మాజీ ఎంపీ గోడాం నగేష్‌ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతిని భావితరాలకు పదిలంగా పరిచయం చేయడానికే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో రూ.12కోట్లతో ఆదివాసీ ఆత్మగౌరవ భవనం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎంపీపీ పంద్రజైవంత్‌రావుతో పాటు సెడ్మాకి సీతారాం, ఆత్రం శేషారావు, కళావతిబండు, నైతం చిత్రు, లచ్చు, శేషానారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising