ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గోండి ధర్మ గురు హీరాసుక జయంతి

ABN, First Publish Date - 2021-03-09T05:19:42+05:30

ప్రధాన్‌ కుల గురువైన హీరాసుక జయంతిని మండలంలోని కేస్లాపూర్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. హీరాసుక చిత్ర పట్టం వద్ద పూజలు నిర్వహించారు.

జాతర్ల గ్రామంలో హీరాసుక చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న ఆదివాసీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంద్రవెల్లి, మార్చి 8: ప్రధాన్‌ కుల గురువైన హీరాసుక జయంతిని మండలంలోని కేస్లాపూర్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. హీరాసుక చిత్ర పట్టం వద్ద  పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  కేస్లాపూర్‌ గ్రామ పటేల్‌ మెస్రం వెంకట్‌రావు మాట్లాడుతూ హీరాసుక చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కోసేరావు, ఉపాధ్యక్షుడు కోవా సురేష్‌, కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం రేణుకనాగనాథ్‌, కోవ మనోజ్‌, మడావి దీపిక్‌రాజ్‌, తదితరులు పాల్గొన్నారు. 

బజార్‌హత్నూర్‌: మండలంలోని జాతర్ల గ్రామంలో ప్రధాన్‌ పురోహిత్‌ సంఘం ఆధ్వర్యంలో గోండి ధర్మగురు హీరసుక జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన్‌ పురోహిత్‌ సంఘం అధ్యక్షుడు గేడం సుధామ్‌ మాట్లాడుతూ జాతి ఉన్నతి, వారి చరిత్రను గురించి రాబోయే తరాల వారికి తెలిసేవిధంగా కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెందుర్‌ ఈశ్వర్‌. ప్రధాన్‌ పురోహిత్‌ సంఘం సభ్యులు మనోహర్‌, దత్త, నాగోరావు, ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T05:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising